సోపుత్ ఇండియన్ మోస్త సక్సెఫుల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా నటించిన సినిమా ‘ఐ’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ శంకర్ – విక్రమ్ లకు ఉన్న క్రేజ్ వలన ఈ సినిమా కలెక్షన్స్ కూడా బాగా స్ట్రాంగ్ గా ఉన్నాయి. మాకు అందిన ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం మొదటి రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి ‘ఐ’ సినిమా 7.7 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.
శంకర్ గత సినిమాల స్థాయిలో ఈ సినిమా లేకపోయినా సినిమాపై ఉన్న క్రేజ్ వలన థియేటర్స్ దగ్గర ప్రేక్షకులు భారులు తీరుతున్నారు. సంక్ర్నతి సీజన్ కావడం వలన రెండవ రోజు కూడా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో సినిమా రన్ అవుతోంది. విక్రమ్ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడి మూడు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించి ప్రేక్షకులను మెప్పించాడు. అమీ జాక్సన్ గ్లామరస్ ట్రీట్ కూడా ఈ సినిమా పెద్ద హెల్ప్ అయ్యింది. ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించాడు.


