బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ వేటలో శంకర్

Shankar
సౌత్ ఇండియన్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ – ఈ పేరు వినగానే మనకు ముందు గుర్తు వచ్చేది ఆడియన్స్ ని థ్రిల్ చేసే గ్రాండ్ విజువల్స్ మరియు సూపర్ స్టార్డం ఉన్న హీరో, హీరోయిన్, యాక్టర్స్. ఈ ఏడాది ‘ఐ’ సినిమాతో మనకు విజువల్ ట్రీట్ అందించిన శంకర్ ప్రస్తుతం ‘రోబో 2’ కి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో శంకర్ తన వర్క్ ని స్పీడప్ చేసాడు. శంకర్ తన ప్రతి సినిమాలోనూ హీరోతో పాటు ఇండియా వ్యాప్తంగా పేరున్న స్టార్ హీరోయిన్స్ నే తన సినిమాకి ఎంచుకోవడం చేస్తుంటారు.

రోబో సినిమాలో ఆల్ ఇండియా ఫేమస్ అయిన ఐశ్వర్య రాయ్ ని హీరోయిన్ గా ఎంచుకున్నాడు. ఇప్పుడు రోబో 2 కి కూడా బాలీవుడ్ లో ఫేమస్ హీరోయిన్ ని ఎంపిక చేసే పనిలో ఉన్నాడు. అందులో భాగంగా హాట్ బ్యూటీస్ అయిన కత్రినా కైఫ్ మరియు దీపిక పడుకొనేలను పరిశీలిస్తున్నాడు. త్వరలోనే వీరిద్దరిలో ఎవరో ఒకరిని హీరోయిన్ గా ఫైనలైజ్ చేసే అవకాశం కనిపిస్తోంది. రోబో 2 సినిమా కోసం శంకర్ మొదటి సారి టాప్ రైటర్ అయిన బి. జయమోహన్ తో కలిసి ఫుల్ స్క్రిప్ట్ ని ప్రిపేర్ చేస్తున్నారు. మరో వైపు రోబో2 లో విలన్ గా విక్రమ్ ని ఫైనలైజ్ చేసారని సమాచారం. ఎఆర్ రెహమాన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తాడు. 2015 చివర్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

Exit mobile version