చరణ్ సినిమాకి సాలిడ్ గా ప్లాన్ చేస్తున్న శంకర్.!

Published on Aug 26, 2021 6:08 pm IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రెండు భారీ మల్టీ స్టారర్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. వీటి తర్వాత మరో అసలైన ప్రాజెక్ట్ శంకర్ తో ప్లాన్ చేసిన సంగతి కూడా తెలిసిందే. అయితే అనౌన్సమెంట్ తోనే భారీ హైప్ తెచ్చుకున్న ఈ చిత్రం అసలు ఎలాంటి జానర్ లో ఉంటుంది శంకర్ మళ్ళీ దీనితో తన స్ట్రాంగ్ కం బ్యాక్ ఇస్తారా లేదా అని చాలా ఆసక్తిగా వారి అభిమానులు ఎదురు చూస్తున్నారు.

అయితే అభిమానులు పెంచుకున్న అంచనాలుకి తగ్గట్టుగానే ఈ చిత్రంని శంకర్ సాలిడ్ ప్లానింగ్స్ లో ఉన్నారట. ముఖ్యంగా సినిమా స్టోరీనే వింటేజ్ శంకర్ సినిమాల తరహాలో ఉంటుంది అని సినీ వర్గాల్లో స్ట్రాంగ్ బజ్. అంతే కాకుండా ఈ చిత్రం మంచి మాస్ పొలిటికల్ థ్రిల్లర్ గా ఉంటుందని తెలుస్తుంది. శంకర్ సినిమా స్టోరీ విషయంలో మాత్రం చాలా కేర్ తీసుకుంటున్నారట. దీనితో ఈ చిత్రంపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సాలిడ్ కాంబో నుంచి వచ్చే చిత్రం ఎలా ఉండనుందో చూడాలి.

సంబంధిత సమాచారం :