శంకర్ సినిమా పాన్ ఇండియన్ లెవెల్లో కాదా.?

Published on Apr 15, 2021 8:00 am IST

అసలు మన దక్షిణాది నుంచి ఎప్పుడో పాన్ ఇండియన్ లెవెల్లో రచ్చ లేపిన దర్శకుడు కోలీవుడ్ స్టార్ దర్శకుడు శంకర్. తనదైన సినిమాలతో ఎప్పుడో ఇండియన్ సినిమా దృష్టి ని దక్షిణాది వైపుకి తాను తిప్పాడు. మరి ఇప్పుడు సీక్వెల్స్ తో పని కానిస్తున్న శంకర్ మరిన్ని భారీ ప్రాజెక్ట్స్ చెయ్యడానికి రెడీగా ఉన్నారు.

వాటిలో మన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో ఓ సెన్సేషనల్ సబ్జెక్టు ఉండగా నిన్ననే మళ్ళీ తన బెంచ్ మార్క్ చిత్రాల్లో ఒకటైన “అపరిచితుడు” హిందీ రీమేక్ కూడా అనౌన్స్ అయ్యింది. అక్కడి స్టార్ హీరో రణ్వీర్ సింగ్ హీరోగా ఈ చిత్రం తెరకెక్కనుంది. అయితే ఈ సినిమాపైనే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాక్ నడుస్తుంది.

ఈ చిత్రం ఒక్క హిందీలోనే తెరకెక్కుతుందా లేక శంకర్ మార్క్ కి తగ్గట్టుగా పాన్ ఇండియన్ లెవెల్లో తెరకెక్కుతుందా అన్న ప్రశ్నకు ఇంకా సమాధానం లేదు. దీనితో ఈ చిత్రం కేవలం హిందీలోనే తెరకెక్కి అక్కడ రిలీజ్ అయ్యే చాన్సులు ఉన్నాయని కూడా మరో టాక్.. మరి వేచి చూడాలి. ఈ భారీ ప్రాజెక్ట్ ఏ లెవెల్లో తెరకెక్కుతుందో అన్నది.

సంబంధిత సమాచారం :