రామ్ చరణ్ విషయంలో శంకర్ ఒక నిర్ణయానికి వచ్చేశారు

Published on May 18, 2021 7:01 pm IST

‘ఆర్ఆర్ఆర్’ చేసే చిత్రం దాదాపు అదే స్థాయిలో ఉండాలని భావించిన రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో సినిమాకి సైన్ చేశారు. శంకర్ మొదటిసారి ఒక తెలుగు హీరోతో డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తుండటంతో చరణ్ ప్రాజెక్ట్ మీద భారీ హైప్ నెలకొంది. రాజమౌళి సినిమా నుండి రిలీఫ్ దొరకగానే శంకర్ సినిమా ప్రాజెక్ట్ పట్టాలెక్కించాలని చరణ్ భాబించారు. నిర్మాత దిల్ రాజు కూడ ఎప్పుడంటే అప్పుడే అన్నట్టు రెడీగా ఉన్నారు. కానీ ‘ఇండియన్-2’ నిర్మాతల రూపంలో అడ్డంకులు మొదలయ్యాయి. తమ సినిమా కంప్లీట్ చేస్తేనే కానీ శంకర్ వేరొక సినిమా మొదలుపెట్టడానికి లేదని కోర్టుకు వెళ్లారు వాళ్ళు.

పలు వాదనలు, మధ్యవర్తిత్వాల తర్వాత ఎట్టకేలకు వివాదం సర్దుమణిగినట్టే ఉంది. ఆగష్టు నుండి షూటింగ్ రీస్టార్ట్ చేయడానికి శంకర్ సుముఖంగా ఉన్నారట. షూటింగ్ మొదలైతే సినిమా కంప్లీట్ కావడానికి కనీసం నాలుగు నెలల సమయం పడుతుంది. అంటే ఈ ఏడాది చివరికి శంకర్ ‘ఇండియన్-2’ నుండి ఫ్రీ అవుతారు. సో.. ఈ సంవత్సరం రామ్ చరణ్ సినిమా మొదలయ్యే అవకాశాలు చాలా తక్కువ. అందుకే శంకర్ అన్ని అడ్డంకులను తొలగించుకుని వచ్చే ఏడాదిలో చరణ్ సినిమాను మొదలుపెట్టాలని డిసైడ్ అయ్యారట.

సంబంధిత సమాచారం :