“గేమ్ ఛేంజర్” రిలీజ్ పై ట్విస్ట్ ఇచ్చిన శంకర్

“గేమ్ ఛేంజర్” రిలీజ్ పై ట్విస్ట్ ఇచ్చిన శంకర్

Published on Jul 2, 2024 7:05 AM IST


గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియార అద్వానీ అలాగే అంజలి హీరోయిన్స్ గా దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ సినిమానే “గేమ్ ఛేంజర్”. మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్నారు కానీ రిలీజ్ ఎప్పుడు అనేది మాత్రం క్లారిటీ లేకుండా పోయింది. ఇదిగో అప్పుడు చేస్తాం ఇప్పుడు చేస్తాం అంటున్నారు కానీ అసలు ఎప్పుడు వస్తారో వారికే క్లారిటీ లేదని చెప్పాలి.

అయితే మెగా ఫ్యాన్స్ ఈ సినిమా ఎలాగైనా ఈ ఏడాదిలోనే వస్తుంది అని ఆశిస్తున్నారు. కానీ శంకర్ దీనికి ట్విస్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఇండియన్ 2 రిలీజ్ అయ్యిన 6 నెలలు తర్వాతే గేమ్ ఛేంజర్ వస్తుంది అని తేల్చేశారు. అంటే ఈ లెక్కన వచ్చే ఏడాదిలోకి సినిమా షిఫ్ట్ అయ్యిపోయింది అని చెప్పాలి. ఇది మాత్రం ఊహించని ట్విస్ట్ అనే అనుకోవాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే దిల్ రాజు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు