
హ్యాట్రిక్ హిట్స్‌తో తెలుగులో మంచి ఫామ్‌లో ఉన్న హీరో నిఖిల్ తాజాగా ‘శంకరాభరణం’ సినిమాతో మెప్పించేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. కొత్త దర్శకుడు ఉదయ్ నందనవనం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా దీపావళి కానుకగా విడుదల కానుంది. ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్ ఈ సినిమాకు ఓ నిర్మాతగా వ్యవహరించడంతో పాటు కథ, స్క్రీన్‌ప్లే మాటలు కూడా అందించడంతో ఈ సినిమా మొదట్నుంచే ఆసక్తికరంగా కనిపిస్తూ వచ్చింది. ఇక ఈ మధ్యే విడుదలైన టీజర్ ఈ సినిమా ఆసక్తిని రెట్టింపు చేసింది.
శంకరాభరణం సినిమాకు మొదట్నుంచీ కనిపిస్తూ వచ్చిన ఆసక్తిని సినిమా రిలీజ్ లోపు క్రేజ్‌గా మార్చుకోవడానికి టీమ్ అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్‌తో టీజర్ రిలీజ్ చేయించి సినిమాపై అంచనాలు పెంచేసిన సినిమా యూనిట్, తాజాగా బాహుబలితో నేషనల్ వైడ్ స్టార్‌గా మారిన రానా చేతుల మీదుగా ప్రమోషనల్ సాంగ్ లాంచ్ చేయించింది. డింగ్ డాంగ్ అంటూ సాగే ఈ పాటను రానా కొద్దిసేపటి క్రితం లాంచ్ చేసి శంకరాభరణం టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఇలా తెలుగులో టాప్ స్టార్స్ చేతుల మీదుగా ట్రైలర్స్, పోస్టర్స్ విడుదల చేయిస్తూ శంకరాభరణం ప్రేక్షకుల్లో మంచి ఆసక్తినే రేకెత్తిస్తుందని చెప్పాలి.
ఇక ఈ సందర్భంగా హీరో నిఖిల్, రచయిత కోన వెంకట్లు రానాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పూర్తి క్రైమ్ కామెడీ సినిమాగా తెలుగు సినిమాకు ఓ సరికొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమాగా శంకరాభరణం నిలుస్తుందని దర్శక నిర్మాతలు తెలియజేస్తూ వస్తున్నారు. ఈనెల 30న ఈ సినిమా ఆడియో రిలీజ్ కానుండగా, దీపావళి కానుకగా సినిమా విడుదల కానుంది.

