
హ్యాట్రిక్ హిట్స్ అందుకొని ఫుల్ ఫాంలో ఉన్న యంగ్ హీరో నిఖిల్ స్టార్ రైటర్ కోన వెంకట్ తో కలిసి చేసిన సినిమా ‘శంకరాభరణం’. సెన్సార్ కూడా పూర్తి చేసుకొని ‘యు/ఏ’ సర్టిఫికేట్ అందుకున్న ఈ సినిమా డిసెంబర్ 4న భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ఉదయ నందనవనం డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నందిత హీరోయిన్ గా నటిస్తే, అంజలి ఓ ముఖ్య పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా ప్రమోషన్స్ ని పెడుతూ ఈ రోజు ఈ చిత్ర టీం హైదరాబాద్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది.
ఈ ప్రెస్ మీట్ లో కోన వెంకట్ మాట్లాడుతూ ‘నా కెరీర్ గ్రాఫ్ ని మార్చేసి నాకు స్టార్ రైటర్ గా గుర్తింపు తెచ్చిన సినిమా ‘ఢీ’. ఆ సినిమా వచ్చిన10ఏళ్ళ తర్వాత మళ్ళీ నా కెరీర్ ని మలుపు తిప్పే సినిమా ‘శంకరాభరణం’. గత కొన్నేళ్లుగా రెగ్యులర్ మూవీ ప్రవాహంలో కొట్టుకుపోయి, ఏ మాత్రం గ్యాప్ లేకుండా పనిచేయడం వలన మనకు తెలియకుండానే మన నుంచి రెగ్యులర్ సినిమాలు వచ్చేస్తుంటాయి. ఆ చట్రం నుంచి బయటకి వచ్చి నన్ను నేను చెక్ చేసుకొని కొత్తగా ఏదన్నా చేయాలి అని చేసిన సినిమా శంకరాభరణం. అందుకే రైటర్, డైరెక్టర్, హీరో అనే వారు ఎన్ని సెంటర్స్ లో రికార్డ్స్ క్రియేట్ చేసింది, ఎంత కలెక్ట్ చేసింది అనే చట్రంలోకి వెళ్ళకూడదు. అదొక మాయ లాంటిది దానివలన మనం కరెక్ట్ సినిమాలు ఎంచుకోము. ఇవన్నీ ఆలోచించి డిఫరెంట్ గా చేసిన సినిమానే శంకరాభరణం. నేను కథ నుకున్న తర్వాత నా ఫస్ట్ అండ్ లాస్ట్ ఛాయస్ నిఖిల్, అలాగే టీం మొత్తం సూపర్బ్ గా కుదిరింది. ఈ సినిమా ద్వారా చాలా మంది అబ్రాడ్ టెక్నీషియన్స్ ని పరిచయం చేసాను. అందరూ ది బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చారని’ అన్నాడు.
నిఖిల్ మాట్లాడుతూ ‘ఇలాంటి ఓ డిఫరెంట్ సినిమా కోసం నన్ను ఎంచుకున్నందుకు కోన వెంకట్ గారికి థాంక్స్ చెప్పాలి. నా ప్రతి సినిమాని సపోర్ట్ చేస్తున్నట్టుగానే మీడియా ఈ సినిమాని కూడా సపోర్ట్ చేస్తుందని ఆశిస్తున్నాను. ఈ నెల 15న వైజాగ్ లోని ఆర్.కె బీచ్ లో ట్రిపుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చేస్తున్నాం. ఆ రోజు నుంచి సరికొత్త రీతిలో సినిమాని ప్రమోట్ చేయనున్నామని’ తెలిపాడు.
వీరితో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న హీరోయిన్ నందిత, డైరెక్టర్ ఉదయ్, మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ లక్కరాజు, ఎడిటర్ ప్రసాద్, కొరియోగ్రాఫర్ శివ తదితరులు ఈ సినిమాలో పనిచేయడం చాలా హ్యాపీ ఫీలింగ్ ఇచ్చిందని, సినిమా కచ్చితంగా సక్సెస్ అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేసారు.