సౌత్ ఇండియన్ మోస్ట్ సక్సెస్ఫుల్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అయిన శంకర్ దర్శకత్వంలో విలక్షణ నటుడు విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఐ’.
ఈ సినిమాని తెలుగులో ‘మనోహరుడు’ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో బిజీ బిజీగా ఉన్న ఈ సినిమాలో విక్రమ్ సరసన అమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తోంది.
చాలా రోజులుగా సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ సినిమా ఫస్ట్ ట్రైలర్ ని ఈ రోజు చెన్నైలో లాంచ్ చేయనున్నారు. మీడియా సమక్షంలో తమిళ, తెలుగు మూవీ ట్రైలర్స్ ని రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్ర ట్రైలర్ చూసిన ప్రముఖులు సింప్లీ సూపర్బ్ అంటున్నారు.
శంకర్ హాలీవుడ్ టెక్నీషియన్స్ తో కలిసి చేస్తున్న ఈ సినిమాలో అందరూ ఆశ్చర్యపోయేలా స్పెషల్ ఎఫెక్ట్స్ ఉండనున్నాయి. అలాగే ఈ సినిమాలో విక్రమ్ పలు డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తారు. ఎఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి పిసి శ్రీరాం సినిమాటోగ్రాఫర్. సెప్టెంబర్ 15న సినిమా ఆడియోని రిలీజ్ చేసి దీపావళి కానుకగా సినిమాని రిలీజ్ చేయడానికి ఈ చిత్ర టీం ప్లాన్ చేస్తోంది.
