లార్డ్ ఆఫ్ ది రింగ్స్ సినిమాకీ, శంకర్ కీ మధ్య సంబంధం ఏమిటి??

లార్డ్ ఆఫ్ ది రింగ్స్ సినిమాకీ, శంకర్ కీ మధ్య సంబంధం ఏమిటి??

Published on Mar 18, 2013 5:45 PM IST

shankar

సౌత్ సినిమాలకు వి. ఎఫ్. ఎక్స్, మేకప్, కాస్ట్యూమ్స్ అన్న పదాలకి కొత్త అర్ధాన్ని చెప్పన దర్శకులలో శంకర్ ఒకడు. అతను తీసిన ‘జీన్స్’ దగ్గరనుండి ‘రోబో’ వరకూ అన్ని సినిమాలలో శంకర్ హాలీవుడ్ కి సంబందించిన బెస్ట్ టెక్నిషియన్స్ ని పెట్టుకుని తెర మీద అద్బుతాలు సృష్టిస్తాడు. ‘రోబో’ సినిమాకు స్టాన్ విన్ట్ సన్ స్టూడియోలో గ్రాఫిక్స్ వర్క్ కి వర్క్ చేసాకా వచ్చిన సినిమాని ఏ ప్రేక్షకుడైన మర్చిపోగలరా? ఇప్పుడు అతని తాజా ‘మనోహరుడు’ సినిమాకి గాను వేటా అనే ప్రపంచంలో అత్యంత ప్రాముఖ్యమైన వి. ఎఫ్. ఎక్స్ స్టూడియోలలో ఒకటైన దానితో పొత్తు కుదుర్చుకున్నాడు. వేటా స్టూడియో సంస్తాపకుడైన పీటర్ జాక్సన్ ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్ ట్రయాలజీ’, ‘కింగ్ కాంగ్’, మరియు ‘హోబ్బిట్’ సిరీస్ లను తెరకెక్కించాడు.

‘మనోహరుడు’ చిత్ర విశేషాలకు వస్తే, శంకర్ తన బ్లాగులో నాలుగు పాటలతో కలిపి ఇప్పటికే సినిమాలో 2/3వ భాగం పూర్తయింది. ఈ సినిమాని చైనా, బ్యాంకాక్, జోధ్ పూర్, మరియు తమిళ్ నాడులో కొన్ని ప్రదేశాలు కొడైకనాల్, చెన్నై, పొల్లాచిలో అద్బుతమైన పరిసరాలలో చిత్రీకరించారని పెర్కున్నాడు. “మేము వేటా వర్క్ షాపులో సేయన్ ఫుట్ అనే ఆర్టిస్ట్ తో విక్రమ్ పై స్పెషల్ సాంగ్ తీసాము. విక్రం ఇందులో అత్యన్నతమైన ప్రదర్శన కనబరిచాడు. వేటా సంస్థ అద్బుతమైన పనీతీరుతో కొత్త తరం ఇండియన్ సినిమాకి సహాయపడుతుందని” శంకర్ తెలిపాడు.

ఈ సినిమాని ఆస్కార్ రవిచంద్రన్ 100 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో విక్రమ్, యామి జాక్సన్ ప్రధాన తారాగణం. విక్రమ్ ఈ సినిమాలో రెండు విభిన్న పాత్రలలో కనిపించనున్నాడు. ఇందులో ఒక పాత్రలో దేహధారుడ్యం కోసం చాలా కష్టపడతున్నాడు. ఏ. ఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. పి. సి. శ్రీరాం సినిమాటోగ్రాఫర్

సంబంధిత సమాచారం

తాజా వార్తలు