మాస్ మహారాజ్ కొత్త సినిమాపై హింటిస్తున్న డైరెక్టర్.!

Published on Jun 29, 2021 1:55 pm IST

మన టాలీవుడ్ మోస్ట్ ఎనర్జెటిక్ హీరోలలో మాస్ మహారాజ్ రవితేజ కూడా ఒకరు. మరి తన లాస్ట్ చిత్రం “క్రాక్” తో సాలిడ్ హిట్ అండ్ కం బ్యాక్ ను అందుకున్న రవితేజ ఆ వెంటనే స్టార్ట్ చేసిన “ఖిలాడి” సినిమాను కూడా ఆల్ మోస్ట్ కంప్లీట్ చేసేసారు. ఇప్పుడు ఫైనల్ స్టేజ్ షూట్ లో ఉన్న ఈ చిత్రం అనంతరం కూడా తన 69వ సినిమాను ఆల్రెడీ ఓకే చేసేసారు.

ఈసారి మరో నూతన దర్శకుడు శరత్ మందవతో ఈ చిత్రాన్ని చేస్తుండగా వచ్చే జూలై 1కి ఈ సినిమా ముహూర్తం కుదిరింది. అయితే ఈ సినిమా విషయంలో మాత్రం దర్శకుడు మొదటి నుంచీ హైప్ ను రవితేజ అభిమానుల్లో ఎక్కడా తగ్గించకుండా నైస్ గా హింట్స్ ఇస్తూ వస్తున్నారు.

మరి ఇప్పుడు కూడా అలానే ఈ చిత్రం టైటిల్ పై ఏదో హింట్ ఇచ్చారు. చిన్న పోస్టర్ కట్ లో “లీడర్ ఆఫ్ ది ప్యాక్” అనే ట్యాగ్ పొందుపరిచారు. దీనితో ఈ చిత్రానికి లీడర్ అనే టైటిల్ ని కానీ ఫిక్స్ చేసారా అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ఈ దర్శకుడు ఏం ట్రీట్ ఇవ్వనున్నాడో తెలియాలి అంటే వచ్చే జూలై 1 వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :