వరుస పరాజయాలతో సూపర్ స్టార్ సందిగ్ధంలో పడ్డారు.

Published on Jun 24, 2019 8:42 am IST

కింగ్ ఖాన్ షారుక్ ప్రస్తుతం తన కెరీర్లోనే అత్యంత ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు వరుస హిట్స్ తో బాలీవుడ్ నెంబర్ వన్ గా ఉన్న షారుక్ వరుస పరాజయాలతో డీలా పడ్డారు. గతకొద్ది కాలంగా ఆయన చేసిన ప్రయత్నాలన్నీ బాక్స్ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఎంతో కష్టపడి ప్రయోగాత్మకంగా తీసిన ”జీరో” ఘోర పరాజయం పొందటంతో షారుక్ కెరీర్ అయోమయంలో పడింది.

దీనితో షారుక్ ప్రస్తుతం అసలు సినిమాలు చేయాలా వద్దా…?చేస్తే ఎటువంటి సినిమాలు చేయాలనే సందిగ్ధంలో పడ్డారట. ఈ విషయంపై ఆయన్ను సంప్రదించగా ప్రస్తుతానికి సినిమాల నుండి విరామం తీసుకున్నాను. నా సమయం కుటుంబంతో గడపడానికి కేటాయిస్తాను అని అని అంటున్నారు. “చెన్నై ఎక్స్ ప్రెస్”, ”హ్యాపీ న్యూ ఇయర్” సినిమాల తరువాత షారుక్ చేసిన అన్ని సినిమాలు పరాజయం పొందాయి.

సంబంధిత సమాచారం :

X
More