సింహానికి గొంతు అరువిచ్చిన షారుక్ ఖాన్

Published on Jun 17, 2019 10:20 am IST

ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ వాల్ట్ డిస్ని నిర్మించిన యానిమేషన్ చిత్రం “ది లయన్ కింగ్”, జులై 19న ప్రపంచ వ్యాప్తంగా భారీ విడుదల కానుంది.1994 లో డిస్ని సంస్థ నిర్మించిన ఈ మూవీని అదే పేరుతో మళ్ళీ ఇప్పుడు రీమేక్ చేస్తున్నారు. 2016 లో వచ్చిన “జంగిల్ బుక్” మూవీ సూపర్ సక్సెస్ కావడంతో డిస్నీ సంస్థ ‘ది లయన్ కింగ్” మూవీని రీమేక్ చేయడం జరిగింది.

ఇప్పుడు ఈ చిత్రం గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. అదేంటంటే ఈ మూవీలోని ప్రధాన పాత్రలైన లయన్ ముఫ్ఫా,సింబా హిందీ డబ్బింగ్ వాయిస్ కొరకు నిర్మాతలు షారుక్ ఖాన్,ఆర్యన్ లను సంప్రదించారట. అందుకు ఆ యానిమల్ పాత్రలకు తమ వాయిస్ అరువివ్వడానికి తండ్రి కొడుకులు ఒప్పుకున్నారట. దీనితో “ది లయన్ కింగ్” మూవీకి మరో ఆకర్షణ చేరినట్లయింది. షారుక్ ప్రస్తుతం ఇంకా ఎటువంటి సినిమాకు కమిట్ కాకపోవడంతో ఇప్పట్లో తెరపైన ఆయనను చూసే అవకాశం లేని అభిమానులు కనీసం ఇలానైనా కొంచెం ఊరట లభించినట్లయింది.

సంబంధిత సమాచారం :

X
More