‘జాను’ ఎఫెక్ట్.. స్మాల్ బ్రేక్ తీసుకున్న శర్వా

Published on Feb 28, 2020 11:15 am IST

హీరో శర్వానంద్ చేస్తున్న కొత్త సినిమాల్లో ‘శ్రీకారం’ కూడా ఒకటి. డెబ్యూ దర్శకుడు కిశోర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంటలు నిర్మిస్తున్నారు. మొదలైన దగ్గర్నుండి ఈ సినిమా షూట్ ఎలాంటి ఆటంకం లేకుండా జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం బ్రేక్ పడిందని అంటున్నారు. ఇందుకు శర్వా గత చిత్రం ‘జాను’ పరాజయమనట.

ఊహించని రీతిలో ‘జాను’ ఫ్లాప్ అయింది. డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలే మిగిలాయి. దీంతో శర్వా కొంత డిస్టర్బ్ అయ్యారట. ఈ ఎఫెక్ట్ నుండి కోలుకోవడానికి అయనకు కొంత బ్రేక్ అవసరమని ‘శ్రీకారం’ నిర్మాతలు భావించారట. దీంతో శర్వానంద్ విదేశాలకు వెళ్లారట. ఇంకొద్ది రోజుల్లో ఆయన తిరిగొచ్చాక సినిమా షూట్ తిరిగి మొదలుపెడతారట. ఇకపోతే మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 24న విడుదలచేయనున్నారు. ఇందులో శర్వాకు జోడీగా ప్రియాంక మోహన్ నటిస్తోంది.

సంబంధిత సమాచారం :