వచ్చే నెలలో మొదలుకానున్న యంగ్ హీరో కొత్త సినిమా

వచ్చే నెలలో మొదలుకానున్న యంగ్ హీరో కొత్త సినిమా

Published on Jul 19, 2016 10:24 AM IST

sharwand
‘ఎక్స్‌ప్రెస్ రాజా’ వంటి హిట్ సినిమా తరువాత యంగ్ హీరో ‘శర్వానంద్’ బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది కాక ఈ హీరో మరో కొత్త సినిమాకి రెడీ అవుతున్నాడు. ప్రముఖ నిర్మాత ‘దిల్ రాజు’ నిర్మాణంలో రచయిత నుండి దర్శకుడిగా పరిచయమవుతున్న ‘వేగేశ్న సతీష్ ‘ దర్శకత్వంలో ‘శతమానం భవతి’ అనే సినిమా చేయనున్నాడు.

ఇప్పటికే ఈ సీజిత్రం తాలూకు ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తికావోస్తుండగా ఆగష్టు నెలలో షూటింగ్ ప్రారంభంకానుంది. ఇకపోతే ఈ చిత్రంలో ప్రేమమ్ నటి, అ.. ఆ.. చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ‘అనుప పరమేశ్వరన్’ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఈ చిత్రం పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరక్కనుం దని కూడా తెలుస్తోంది.

తాజా వార్తలు