‘రన్ రాజా రన్’ సినిమా విజయంతో మంచి జోరుమీదున్న యువ హీరో శర్వానంద్, ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ సినిమా ఆడియో హిట్టవ్వడంతో చాలా సంతోషంగా ఉన్నారు. ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. మొదటి నుండి ఈ సినిమాపై నమ్మకం వ్యక్తం చేసుకున్న శర్వానంద్, సినిమా విజయంపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. విజయం తధ్యమని తన సన్నిహితుల వద్ద చెప్తున్నారు.
నిత్యా మీనన్ ముస్లిం యువతిగా నటిస్తున్న ఈ సినిమాలో శర్వానంద్ అథ్లెట్ పాత్రను పోషిస్తున్నారు. ముఖ్యంగా ట్రైలర్ లో శర్వానంద్, నిత్యాల డైలాగ్స్ గురించి ప్రేక్షకులు డిస్కస్ చేసుకుంటున్నారు. బుర్రా సాయి మాధవ్ రాసిన డైలాగ్స్ అంతలా ప్రేక్షకుల హృదయాలను తాకాయి. క్రియేటివ్ కమర్షియల్ పతాకంపై కెఎస్ రామారావు సమర్పణలో కెఏ వల్లభ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
