శర్వా మామూలోడు కాదు.. త్వరగానే కోలుకున్నాడు

శర్వా మామూలోడు కాదు.. త్వరగానే కోలుకున్నాడు

Published on Jun 28, 2019 10:00 PM IST

Sharwanad

హీరో శర్వానంద్ కొన్ని రోజుల క్రితం థాయ్‌లాండ్‌లో స్కైడైవింగ్ శిక్షణ తీసుకుంటూ ప్రమాదానికి గురై గాయపడిన సంగతి తెలిసిందే. గాయం పెద్దది కావడంతో కుడి భుజం ఎముక ముక్కలైంది. వైద్యులు ఆయనకు నాలుగు గంటల పాటు క్లిష్టమైన సర్జరీ నిర్వహించారు. కొన్నిరోజుల ఆసుపత్రిలోనే ఉన్న ఆయన 22వ తేదీన ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు.

ఇంట్లోనే ఉంటూ ఫిజియోథెరపీ చికిత్స తీసుకున్న ఆయన కోలుకోవడానికి కొంచెం ఎక్కువ సమయమే పడుతుందని వైద్యులు తెలిపారు. దీంతో శర్వా ఇంకో రెండు మూడు నెలలపాటు సినిమాల జోలికి వెళ్లడని అనుకున్నారు అందరూ. కానీ అనూహ్యంగా వైద్యులు చెప్పిన గడువు కంటే ముందుగానే కోలుకున్న శర్వా త్వరలోనే రణరంగం సినిమా పనుల్లో పాల్గొనడానికి రెడీ అవుతున్నట్టు తెలిపారు. శర్వా ఇంత త్వరగా కోలుకుని సెట్లోకి వస్తుండటంతో ‘రణరంగం’ టీమ్, అభిమానులు సంతోషిస్తున్నారు. సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆగష్టు 2వ తేదీన విడుదలచేయనున్నారు. ఇందులో శర్వాకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు