అందమైన లొకేషనల్లో శర్వానంద్ సినిమా షూటింగ్ !


‘రాధ’ సినిమా తర్వాత యంగ్ హీరో శర్వానంద్ యూత్ ఫుల్ డైరెక్టర్ మారుతి డైరెక్షన్లో ‘మహానుభావుడు’ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉండనున్న ఈ చిత్రాన్ని విజువల్ గా గ్రాండ్ గా కనబడేలా రూపొందిస్తున్నారు మారుతి. అందుకోసమే ప్రస్తుతం పొల్లాచ్చి వంటి ఫేమస్ లొకేషన్లలో షూటింగ్ జరుపుతున్నారు.

ఇంతకు ముందు కూడా చిత్ర యూనిట్ యూరప్ లోని మిలాన్, ఇటలీ వంటి ఖరీదైన లొకేషనల్లో షూట్ చేశారు. ‘కృష్ణగాడి వీర ప్రేమగాధ’తో తెలుగువారికి హీరోయిన్ గా పరిచయమై నటిగా మంచి మార్కులు తెచ్చుకున్న మెహ్రీన్ ఇందులో శర్వానంద్ కు జోడీగా నటిస్తుండగా ప్రముఖ కమెడియన్ వెన్నెల కిశోర్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ ప్రాజెక్టును యువీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్-2 బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.