శ్రీ లిఖిత మూవీ మేకర్స్ పతాకంపై శ్రీను ముదిరాజ్ దర్శకత్వంలో గ్రాండ్ గా నిర్మితమవుతున్న మూడో సినిమా శాసనం. ఈ సినిమాకి శ్రీమతి మంజుల ముదిరాజ్ సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. భారీ తారాగణంతో పాటు, నూతన నటీ నటుల ఎంపిక కూడా ప్రస్తుతం జరుగుతుంది. వచ్చే నెలలో మూవీ షూటింగ్ ప్రారంభించి మూడు షెడ్యూల్స్ లో షూటింగ్ పూర్తి చేస్తామని దర్శకులు శ్రీను ముదిరాజ్ తెలియజేశారు. ఇక నేడు ఈ మూవీ పాటల రికార్డింగ్ కార్యక్రమంతో ప్రారంభమైనది.
అభినయ శ్రీనివాస్ రాసిన నింగి నేల సింగిడి జతగా అంటూ సాగే సుందరమైన గీతాన్ని నందన్ రాజ్ బొబ్బిలి సంగీత సారధ్యంలో తొలి పాటగా రికార్డు చేశారు. కాగా శాసనం సినిమా గ్రామీణ నేపథ్యంలో సాగే యాక్షన్ బేస్డ్ లవ్ స్టోరీగా తెరకెక్కనుంది. అలానే ఈ సినిమా ఆకట్టుకునే కథ, కథనాలతో ఉత్కంఠభరితంగా సాగుతుందని, సినిమాలో సంగీతానికి కూడా ఎంతో ప్రాధాన్యత ఉందని, తప్పకుండా రిలీజ్ తరువాత ఇది అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుందని దర్శకుడు శ్రీను ముదిరాజ్ తెలిపారు. చిట్టిశర్మ డైలాగ్స్ అందిస్తున్న ఈ మూవీకి పాటలను అభినయ శ్రీనివాస్, సాయి సిరి రాస్తుండగా సంగీతాన్ని నందన్ రాజ్ బొబ్బిలి సమకూరుస్తున్నారు. అలానే కొరియోగ్రఫిని రమేష్ ఎర్రోళ్ళ, సినిమాటోగ్రఫీ ని ఆర్. మణిప్రసాద్ అందిస్తున్నారు.


