డబ్బింగ్ మొదలెట్టిన శౌర్య, రితూ వర్మ !

Published on Apr 4, 2021 8:50 pm IST

హీరో నాగ శౌర్య, ప్రతిభావంతులైన నటి రితు వర్మ తమ తదుపరి రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘వరుడు కావలేను’ కోసం వీరిద్దరూ ఈ రోజు డబ్బింగ్ ప్రారంభించారు. ఇక ‘వరుడు కావలేను’ టీజర్ అతి త్వరలో విడుదల కానుంది. వరుడు కావలేను టీజర్ అతి త్వరలో విడుదల కానుంది. ఇక ఈ చిత్ర కథ, కథనం, మాటలు, పాటలు, సన్నివేశాలు, భావోద్వేగాలు,నటీ నటుల అభినయాలు చిత్ర కథా నుగుణంగా సాగి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తాయి అన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు చిత్ర దర్శక నిర్మాతలు.

ఈ చిత్రాన్ని లక్ష్మీ సౌజన్య డైరెక్ట్ చేయనున్నారు. విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకు సంగీత అందిస్తుండగా వంశీ పచ్చి పులుసు సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పి.డి.వి.ప్రసాద్ సమర్పిస్తున్నారు. కాగా నదియా, మురళీశర్మ, వెన్నెలకిషార్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు ప్రధాన పాత్రలుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: గణేష్ కుమార్ రావూరి.

సంబంధిత సమాచారం :