మహేష్ పక్కన ఛాన్స్ మిస్ చేసుకుని, ప్రస్తుతం ప్రభాస్ పక్కన నటిస్తున్న ఇండోజర్మన్ నటి
Published on Apr 25, 2018 12:09 pm IST

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వం లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న చిత్రం ‘సాహో’. ఈ చిత్రంలో క ముఖ్యమైన పాత్రకు బాలీవుడ్ నటి ఎల్విన్ శర్మ ను తీసుకున్నారు. ఈ ఇండోజర్మన్ నటి బాలీవుడ్ లో సిడ్నీ విత్ లవ్ చిత్రంతో అరంగేట్రం చేసింది. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతూ, తనకు ఇదివరకే ఒక సౌత్ చిత్రంలో నటించే అవకాశం వచ్చిందని చెప్పింది.

అది కూడా సూపర్ స్టార్ మహేష్ పక్కన నటించే అవకాశం వచ్చినప్పటికీ, తన డేట్స్ అడ్జస్ట్ మెంట్ చేయలేని కారణంగా ఆ ఛాన్స్ వదులుకోవలసి వచ్చిందని చెప్పింది. బాహుబలి సినిమా చూసాక ప్రభాస్ పక్కన ఛాన్స్ వస్తే బాగుండు అనుకున్నానని, అయితే ప్రస్తుతం సాహోలో ఆయనపక్కన నటించే ఛాన్స్ సడన్ గా రావడంతో తన కల నెరవేరినట్లయిందని చెప్పుకొచ్చింది. కాగా ప్రస్తుతం జరుగుతున్న సాహో యుఏఈ షెడ్యూల్ లో ఎల్విన్ శర్మ కొన్ని థ్రిల్లింగ్ యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది….

 
Like us on Facebook