మరో సినిమా కూడా ఆ నిర్మాతతోనే చేస్తున్న శేఖర్ కమ్ముల..!

Published on May 23, 2020 1:45 am IST

టాలీవుడ్‌లో క్లాసిక్ అండ్ రొమాంటిక్ మూవీస్ దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల హీరో నాగ చైతన్యతో లవ్‌స్టోరీ సినిమా చేసిన సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌లో శ్రీ సునీల్ నారాయణదాస్ నారంగ్ నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కి సిద్దం కాబోతుంది.

అయితే ఈ సినిమా తరువాత శేఖర్ కమ్ముల తన తదుపరి సినిమా కూడా ప్రొడ్యూసర్ సునీల్ నారాయణదాస్ నారంగ్ గారితోనే చేస్తున్నట్టు సమాచారం. ఓ పెద్ద హీరో ఈ సినిమాలో నటిస్తున్నారని, స్టోరీ డిస్కషన్స్ ఆల్రెడీ జరుగుతున్నాయని, స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది. అయితే శేఖర్ కమ్ముల పనితీరు మరియు లవ్ స్టోరీ సినిమా మీద కాన్ఫిడెంట్‌గా ఉన్నారు కాబట్టే శేఖర్ కమ్ములతో తమ నెక్స్ట్ ప్రాజెక్ట్‌కు కూడా ప్రొ డ్యూసర్ సునీల్ నారాయణదాస్ నారంగ్ సైన్ చేసేసుకున్నారు. అయితే ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్.పి బ్యానర్ మీద నిర్మించనున్నట్టు సమాచారం. అయితే దీనికి సంబంధించిన తదుపరి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

సంబంధిత సమాచారం :

X
More