శేఖర్ కమ్ముల ఎందుకు అంత తొందరపడుతున్నాడు.

Published on Mar 21, 2020 2:22 pm IST

నాగ చైత్యన్య, సాయి పల్లవి జంటగా ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న చిత్రం లవ్ స్టోరీ. చైతూ తో చేస్తున్న శేఖర్ కమ్ముల మొదటి చిత్రం లవ్ స్టోరీ కాగా మూవీపై మంచి అంచనాలున్నాయి. ఈ చిత్రంలో నాగ చైతన్య కంప్లీట్ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నారు. ఆయన మిడిల్ క్లాస్ యువకుడి రోల్ చేస్తున్నాడు.

కరోనా వైరస్ కారణంగా మూవీ విడుదల వాయిదా వేయగా మేలో విడుదల కానుంది. కాగా శేఖర్ కమ్ముల మిగిలిన షూటింగ్ పార్ట్ పూర్తి చేసే పనిలో ఉన్నారట. కరోనాకు బయపడి అందరూ షూటింగ్స్ కి బంద్ ప్రకటించిన నేపథ్యంలో శేఖర్ కమ్ముల మాత్రం షూటింగ్ కంటిన్యూ చేస్తున్నారట. పూర్తయిన సినిమాలు సైతం విడుదల లేక ఇబ్బందిపడుతున్న తరుణంలో శేఖర్ ఇలాంటి ప్రతి కూల పరిస్థితులలో షూటింగ్ జరపాల్సిన అవసరం ఏముందని అందరూ అంటున్నారు.

సంబంధిత సమాచారం :