శేఖర్ కమ్ముల కు హీరో దొరికాడు ?

Published on Jul 17, 2018 2:36 pm IST

గత ఏడాది వరుణ్ తేజ్ , సాయి పల్లవి లు జంటగా దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన చిత్రం’ఫిదా’. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈచిత్రం సుమారు 40 కోట్ల కలెక్షన్స్ ను సాధించి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా తరువాత శేఖర్ కమ్ముల ఇంతవరకు తన తదుపరి చిత్రాన్ని ప్రకటించకలేదు. సినిమా హిట్ అయినా కూడా ఏడాదిగా ఎదురుచూస్తున్న ఈ దర్శకుడికి తాజాగా హీరో దొరికాడని సమాచారం .

అయితే అయన తెలుగు హీరో కాదు. తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ ను తెలుగు పేక్షకులకు పరచియం చేయుయనున్నారట శేఖర్ కమ్ముల అంతే కాకుండా ఈ చిత్రాన్ని కూడా ఆయనే నిర్మించనున్నారని సమాచారం. అయితే ఈ వార్తల ఫై అధికారిక సమాచారం వెలుబడాల్సి ఉంది.

ప్రస్తుతం ధృవ్ తమిళ భాషలో ‘అర్జున్ రెడ్డి’ చిత్రానికి రీమేక్ గా వస్తున్న ‘వర్మ’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తోనే ఆయన తమిళ తెరకు పరిచయం కాబోతున్నాడు.

సంబంధిత సమాచారం :