అలాంటి అరుదైన పాత్రల్లో నాగ చైతన్య పాత్ర ఒకటి

Published on Dec 2, 2019 1:08 pm IST

అక్కినేని యువ హీరో నాగ చైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రొమాంటిక్ ఎంటెర్టైనర్లో చైతూ తెలంగాణ పల్లెటూరి కుర్రాడిగా కనిపించనున్నాడు. సినిమాకి ఈయన పాత్రే ప్రధాన ఆకర్షణట. ఈ పాత్ర గురించి శేఖర్ కమ్ముల మాట్లాడుతూ మన పరిశ్రమలో తెలంగాణ గ్రామీణ నేపథ్యం నుండి వచ్చే హీరో పాత్రలు చాలా తక్కువ.. అలాంటి అరుదైన పాత్రల్లో చైతూ చేస్తున్న క్యారెక్టర్ ఒకటని అన్నారు.

ఈ పాత్ర కోసం చై తెలంగాణ యాసను నేర్చుకుంటున్నారు. నేర్చుకోవడం అంటే ఏదో నామమాత్రానికి కాదు.. యాసపై పూర్తిగా పట్టు సాధించేలా కష్టపడుతున్నాడట. ఇందులో కథానాయకిగా సాయి పల్లవి నటిస్తోంది. తమ కలల్ని నిజం చేసుకోవడం కోసం హైదరాబాద్ వచ్చిన యువతీయువకుల కథగా ఈ చిత్రం ఉండనుంది. నారాయణ్ దాస్ కె నారంగ్, రామ్మోహన్ రావ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే యేడాది ప్రథమార్థంలో విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం :

More