నమ్మిన సిద్ధాంతం కోసం 10కోట్ల ఆఫర్ వదిలేసిన నటి.

Published on Aug 19, 2019 7:03 pm IST

బాలీవుడ్ తారలతో శిల్పా శెట్టిని ఫిట్నెస్ ఐకాన్ గా చెప్పుకుంటారు. ప్రొఫెషనల్ యోగ ట్రైనర్ అయిన శిల్పా ఫిట్నెస్ అవగాహనపై అనేక వీడియోలు కూడా చేయడం జరిగింది. 44ఏళ్ల ఈ బ్యూటీ హెల్తీ డైట్, రోజు వారి వ్యాయామం విషయంలో కూడా చాలా స్క్రిట్ గా ఉంటారు. అందుకే ఈ అమ్మడు 40ప్లస్ ఏజ్ లో కూడా 20 ప్లస్ లా కనిపిస్తున్నారు. ఐతే తాజాగా ఓ ఆయుర్వేదిక్ సంస్థ బరువు తగ్గించే తమ ప్రోడక్ట్ కి ప్రచార కర్తగా ఉండమనగా తిరస్కరించారన్నవిషయం తెలిసిందే. ఆమెకు సదరు సంస్థ 10కోట్ల భారీ పారితోషకం ఆఫర్ చేసినా శిల్ప ససేమిరా అందట.

అంత పెద్ద ఆఫర్ ని వదిలివేయడం వెనుక గల కారణాలను వెలికితీయడానికి ఓ ప్రముఖ పత్రిక ఆమెను సంప్రదించగా కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారట. నేను నమ్మని సిద్ధాంతాన్ని నేను ప్రచారం చేయను. టాబ్లెట్స్ వేసుకోవడం వలన స్లిమ్ గా తయారవడం జరగని పని, ఒకవేళ ఆలా జరిగినా అది ఆరోగ్యానికి మంచిది కాదనే అర్థం. క్రమం తప్పని వ్యాయామం, ఆరోగ్యరకరమైన ఆహారపు అలవాట్లు మాత్రమే ధీర్ఘకాలపు ఫలితాలను ఇస్తాయంటూ ఆమె చెప్పుకొచ్చారు.

బాలీవుడ్ కి చెందిన శిల్పా శెట్టి తెలుగులో వెంకటేష్ సరసన సాగరవీరుడు సాగరకన్య, నాగార్జున తో ఆజాద్, మోహన్ బాబు ప్రక్కన వేడెవడండీ బాబు చిత్రాలతో పాటు బాలకృష్ణ హీరోగా వచ్చిన భలేవాడివి బాసు మూవీలో నటించింది.

సంబంధిత సమాచారం :