‘జైలర్-2’లో తన పాత్రపై శివన్న కామెంట్స్.. ఏమన్నారంటే..?

‘జైలర్-2’లో తన పాత్రపై శివన్న కామెంట్స్.. ఏమన్నారంటే..?

Published on Dec 23, 2025 10:51 AM IST

జైలర్-2

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ప్రెస్టీజియస్ క్రేజీ సీక్వెల్ ‘జైలర్-2’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో పలు క్రేజీ కేమియోలు ఉండనున్నాయి.

తొలి భాగంలో కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్, మలయాళ స్టార్ మోహన్ లాల్ కేమియో పాత్రల్లో నటించి అదరగొట్టారు. అయితే, ఈ సీక్వెల్ మూవీలో కూడా తన పాత్ర అద్భుతంగా ఉండబోతుందని శివ రాజ్‌కుమార్ తెలిపారు. తన పాత్రపై ఆయన స్పందిస్తూ, తొలి భాగంలో కంటే ఈ సినిమాలో తన పాత్ర నిడివి ఎక్కువగా ఉండబోతుందని, ప్రేక్షకులు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని ఆయన తెలిపారు.

ఇక ఈ సినిమాలో రమ్యకృష్ణ, జాకీ ష్రాఫ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తుండగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిథి మారన్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు