ఆడియో రిలీజ్‌కు సిద్ధమవుతోన్న ‘శివమ్’..!

ఆడియో రిలీజ్‌కు సిద్ధమవుతోన్న ‘శివమ్’..!

Published on Sep 2, 2015 2:32 PM IST

shivam
రామ్.. గత కొన్నాళ్ళుగా ఎదురుచూసిన హిట్ ‘పండగ చేస్కో’తో దక్కడంతో ఆ వెంటనే వరుస సినిమాలతో బిజీ బిజీ అయిపోయారు. ప్రస్తుతం తమ సొంత బ్యానర్ స్రవంతి మూవీస్‌పై రామ్ ‘శివమ్’, ‘హరికథ’ పేర్లతో రెండు సినిమాలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాల్లో శివమ్ ఇప్పటికే టాకీ పార్ట్‌తో పాటు, కొన్ని పాటలను కూడా పూర్తి చేసుకొని చివరిదశకు చేరుకుంది. అక్టోబర్ 2న ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతూ రూపొందిస్తోన్న ఈ సినిమాలో రాశిఖన్నా హీరోయిన్‌గా నటించారు.

ఇక ఈ మధ్యే పూర్తి అయిన ఫారిన్ షెడ్యూల్‌లో రెండు అందమైన పాటలు తెరకెక్కించామని, మరో రెండు పాటల షూటింగ్‌తో సినిమా పూర్తవుతుందని రామ్ తెలిపారు. ఇక త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఆడియో విడుదల కానుందని రామ్ ఈ సందర్భంగా తెలిపారు. హై వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కుతోన్న ఈ లవ్‌స్టోరీ అందరినీ మెప్పించేలా ఉంటుందని దర్శక నిర్మాతలు తెలిపారు. ఆడియో రిలీజ్ కంటే ముందే ట్రైలర్‌ను విడుదల చేసే ఆలోచనలో సినిమా యూనిట్ ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు