మరో సినిమా ఆఫర్ దక్కించుకున్న “దొరసాని”..!

Published on Jun 30, 2021 2:13 am IST


టాలీవుడ్ సీనియర్ నటుడు రాజశేఖర్ కూతురు శివాత్మిక మరో సినిమా ఛాన్స్ దక్కించుకుంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా చేసిన “దొరసాని” చిత్రంతో శివాత్మిక హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ అమ్మడు తొలి సినిమాలోనే తన నేచురల్ యాక్టింగ్‌తో మంచి మార్కులు కొట్టేసినప్పటికి టాలీవుడ్ నుంచి పెద్దగా ఆమెకు సినిమా ఆఫర్లు రాలేదు. దీంతో కోలివుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చి తన అదృష్టాన్ని పరిక్షీంచుకుంటుంది.

అయితే ప్రస్తుతం తమిళంలో శివాత్మిక చేస్తున్న తొలి సినిమా “ఆనందం విలయాడుమ్ వీడు” విడుదల కాకముందే ఆమెకు ఓ ఆఫర్ వచ్చి పడిందట. ఆర్.కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న మరో కోలివుడ్ చిత్రంలో శివాత్మిక హీరోయిన్‌గా చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ దొరసాని తెలుగులో కృష్ణ వంశీ దర్శకత్వంలో వస్తున్న “రంగ మార్తాండ” సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :