ఓటు వేయలేకపోయిన చరణ్ అత్తమ్మ !

Published on Apr 11, 2019 2:55 pm IST

ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో టాలీవుడ్ సినీ ప్రముఖులు వారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక రామ్ చరణ్ అత్తమ్మ , ఉపాసన అమ్మ శోభన కామినేని తన ఓటు హక్కును వినియోగించుకోవాడినికి పోలింగ్ బూతు కు వెళ్లారు. అయితే లిస్ట్ లో తన పేరు లేకపోవడంతో ఆమె ఖంగుతిన్నారు.

10రోజుల క్రితం చెక్ చేసినప్పుడు లిస్ట్ లో తన పేరు వుందని అయితే ఈరోజు ఓటు వేయడానికి వస్తే తన పేరు ను తీసేశారని ఆమె అన్ని టాక్స్ లు సక్రమంగా చెల్లించిందని ఉపాసన తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఇక లిస్ట్ లో తన పేరు లేకపోవడంతో శోభన కామినేని తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది.

సంబంధిత సమాచారం :