షాకింగ్ : తెలుగు సినిమా వద్ద ముగిసిన మరో శకం..సూపర్ స్టార్ ఇక లేరు.!

షాకింగ్ : తెలుగు సినిమా వద్ద ముగిసిన మరో శకం..సూపర్ స్టార్ ఇక లేరు.!

Published on Nov 15, 2022 7:05 AM IST

నిన్ననే తెలుగు సినిమా దిగ్గజ నటుల్లో ఒకరైనటువంటి హీరో సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్య రీత్యా హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యినట్టుగా వార్తలు రావడం షాకింగ్ గా మారింది. అయితే ఇంత తక్కువ వ్యవధిలోనే ఆయన మీద ఒక చేదు వార్తతో ఈ ఉదయం మొదలు అవుతుంది అని ఎవరూ ఊహించి ఉండదు.

గత కొన్ని వారాల కితమే సూపర్ స్టార్ కృష్ణ గారి సతీమణి మరణ వార్త ఎంతటి విషాదాన్ని ఘట్టమనేని వారి ఇంట తీవ్ర విషాదాన్ని నెలకొల్పగా ఇప్పుడు ఈ లెజెండరీ నటుణ్ని కోల్పోవడం అనేది మహేష్ బాబు కి మరో వర్ణనాతీత బాధాకర వార్త కాగా మన తెలుగు సినిమా దగ్గర కూడా ఓ తీరని లోటు. నిన్న కృష్ణ గారు గుండెల్లో నొప్పితో హాస్పిటల్ లో అడ్మిట్ కాగా దాదాపు 8 మంది వైద్యులు చాలా శ్రమించినా ఫలితం లేకపోయింది.

దీనితో కృష్ణ తన 79వ ఏట కన్ను మూశారు. మరి తెలుగులో అప్పట్లోనే ఎన్నెన్నో ట్రెండ్ సెట్టింగ్ సినిమాలు పరిచయం చేసి అసలు తెలుగు సినిమాలో జేమ్స్ బాండ్ అయినా ఎన్నో కొత్త తరహా సినిమాలు ప్రయోగాలు చేయడం అయినా మొదటిగా వారు వేసిన బాటే ఇది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

1942 మే 30న బుర్రిపాలెం లో జన్మించిన తాను 1961 లో సినీ పరిశ్రమలో అడుగు పెట్టారు. మరి ఈ ఏడాదిలోనే “కుల గోత్రాలు” అనే సినిమాతో తన సినీ ప్రస్థానాన్ని ఆయన స్టార్ట్ చేయగా ఆయన నటునిగానే కాకుండా దర్శకునిగా నిర్మాతగా, ఓ రాజకీయ నాయకునిగా ప్రజలకు సేవ కూడా చేశారు. అలాగే తాను 350 సినిమాలకి పైగా నటించగా 16 చిత్రాలకి పైగా నిర్మాణం వహించారు.

మరి ఇలాంటి దిగ్గజ నటులు ఇక లేరు అనే మాటే ఎవరికీ మింగుడు పడనిది.. మరి ఆయన లేని లోటు తెలుగు సినిమా దగ్గర ఎవరూ పూడ్చనటువంటిది. తెలుగు సినిమా వద్ద ముగిసిన కృష్ణ గారి శకానికి అశ్రు నివాళులు అర్పిస్తూ వారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని మా 123తెలుగు బృందం ఆకాంక్షిస్తుంది. ఓం శాంతి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు