శంకర్ డ్రీం ప్రాజెక్ట్ కి షాకింగ్ బడ్జెట్.. ఈ నిర్మాణ సంస్థ ముందుకి వచ్చిందా?

shankar

ఇండియన్ సినిమా దగ్గర ఒక గేమ్ ఛేంజర్ దర్శకుడు శంకర్ ఇప్పుడు గడ్డుకాలంలో ఉన్న సంగతి తెలిసిందే. దీనితో తన కంబ్యాక్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. అయితే ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ సినిమాలు వరుస డిజప్పాయింట్మెంట్ లు కావడంతో నెక్స్ట్ సినిమా పరిస్థితి ఏంటి అనేది అర్ధం కాలేదు. కానీ ఇప్పుడు శంకర్ తన డ్రీం ప్రాజెక్ట్ పనుల్లో ఉన్నారు.

అయితే దీనికి భారీ బడ్జెట్ అవసరం ఉంటుంది అనే టాక్ ఉంది. మరి ఆ బడ్జెట్ ని పెట్టే నిర్మాత, నిర్మాణ సంస్థ ఎవరు అనేది ఇప్పుడు వినిపిస్తుంది. శంకర్ కోసం ఏకంగా 1000 కోట్ల బడ్జెట్ తో బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ పెన్ మూవీస్ వారు వచ్చినట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఇది మొత్తం మూడు భాగాల ప్రాజెక్ట్ కాగా మూడింటికి కలిపి ఆ రేంజ్ బడ్జెట్ అవుతుందట. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది. ఈ చిత్రం అయితే వచ్చే ఏడాది జూన్ నుంచి షూటింగ్ మొదలు పెట్టుకోనుందట.

Exit mobile version