గత ఏడాది ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచినా చిత్రమే “ధురంధర్”. టాలెంటెడ్ హీరో రణ్వీర్ సింగ్ హీరోగా సారా అర్జున్ హీరోయిన్ గా దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ సాలిడ్ స్పై యాక్షన్ డ్రామా ఊహించని సెన్సేషన్ ని కేవలం ఒక్క భాషలోనే సెట్ చేసింది. దీనితో పార్ట్ 2 పై మరింత హైప్ నెలకొనగా ఈ పార్ట్ తో యష్ నటించిన భారీ చిత్రం టాక్సిక్ పోటీలో ఉంది.
అయితే ఈ సినిమాల్లో ఒకటే ఇప్పుడు విడుదలకి వస్తుంది అంటూ పలు రూమర్స్ మొదలయ్యాయి. మెయిన్ గా ధురంధర్ 2 వాయిదా పడొచ్చు అంటూ ఎక్కువ వినిపిస్తుంది. ధురంధర్ 2 కి కొన్ని రీషూట్స్ బాకీ ఉన్నాయని అలాగే సంగీతం పరంగా పనులు, మెయిన్ గా ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ వారు రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం చర్చకి దారి తీసింది.
ధురంధర్ 2 నిర్మాతలు, దర్శకుడు సినిమాకి వర్క్ చేస్తున్న వర్కర్స్ విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకుండా నెగ్లెక్ట్ చేస్తున్నారని దీనిపై స్ట్రిక్ట్ ఇన్స్పెక్షన్ చేయాలని డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. దీనితో ధురంధర్ 2 రిలీజ్ కి నెల సమయమే ఉన్న సమయంలో ఇలాంటివి ఎదురు కావడం మరింత ఆసక్తి రేకెత్తిస్తుంది. సో వీటితో ఈ అవైటెడ్ సీక్వెల్ రిలీజ్ పై ఎఫెక్ట్ పడుతుందా లేక ఆన్ టైం వస్తుందా అనేది వేచి చూడాలి.
