ఒక సినిమాకి రూ.50 కోట్లు, ఇంకో సినిమాకు రూ.80 కోట్లు తీసుకున్న స్టార్ హీరో

Published on Mar 13, 2020 10:28 pm IST

తమిళ స్టార్ హీరో విజయ్ సినిమాలు చాలా ఈజీగా వంద కోట్లకు పైగానే థియేట్రికల్ వసూళ్లు సాధిస్తున్నాయి. దీంతో నిర్మాతలు ఆయనకు భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఇవ్వడానికి పెద్దగా ఆలోచించట్లేదు. సినిమా హిట్టైతే వచ్చే వసూళ్లు భారీగా ఉంటుండటమే ఇందుకు కారణం. తాజాగా నిన్న విజయ్ ఇంట్లో ఐటీ అధికారులు మరోసరి సోదాలు నిర్వహించారు. ఈ రైడ్స్ గురించి చెబుతూ విజయ్ మధ్య తీసుకున్న రెమ్యునరేషన్ వివరాల్ని వెల్లడించారట.

తన గత చిత్రం ‘బిగిల్’కు పారితోషకంగా రూ.50 కోట్లు అందుకున్నారట విజయ్. ఆ సినిమా భారీ హిట్టవడంతో ప్రస్తుతం చేస్తున్న ‘మాస్టర్’ చిట్రానికిగాను రెమ్యునరేషన్ రూ.80 కోట్లు అందుకున్నట్టు తెలుస్తోంది. ఇవి చాలా భారీ మొత్తాలే అయినా ఆయన స్టార్ డమ్, బాక్స్ ఆఫీస్ స్టామినాను దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు అంత డబ్బును చెల్లించారట. అలాగే ఈ పారితోషకాలకుగాను ఆయన పన్నులు సక్రమంగానే చెల్లించినట్టు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :

More