షాకింగ్ సంఘటన..”కేజీయఫ్” షోలో కాలేసాడని కాల్చేశాడు.!

Published on Apr 21, 2022 4:00 pm IST


తాజాగా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర వచ్చిన భారీ సినిమా “కేజీయఫ్ చాప్టర్ 2” రిలీజ్ అయ్యి సెన్సెషన్ ని నమోదు చేస్తున్న ఈ చిత్రం థియేటర్స్ లో చూసి ఆడియెన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇదే కేజీయఫ్ ప్రదర్శితం అవుతున్న ఓ థియేటర్ లో ఓ షోలో షాకింగ్ సంఘటన చోటు చేసుకోవడం షాకింగ్ గా మారింది.

మరి అసలు వివరాల్లోకి వెళితే కేజీయఫ్ చిత్ర ఇండస్ట్రీ కర్ణాటక లోనే ఓ థియేటర్ లో కొంతమంది యువకులు సినిమా చూడ్డానికి వెళ్లారు. అయితే వారిలో ఓ యువకుడు తన ముందు వరుస కుర్చీపై కాలు నిర్లక్ష్యంగా వేసాడు. దీనితో ముందు సీటులో కూర్చున్న వ్యక్తి కాలు తియ్యమని సీరియస్ గానే చెప్పగా అక్కడ నుంచి గొడవ పెద్దది అయ్యిపోయింది.

దీనితో ముందు వరుసలో కూర్చున్న వ్యక్తి ఏమనుకున్నాడో గాని బయటికి వెళ్లి సినిమా అయ్యే లోపే వచ్చి ఆ కాలేసిన వ్యక్తిని గన్ తో మూడు రౌండ్ లు కాల్చేశాడు. దీనితో ఈ ఘటనపై ఒక్కసారిగా థియేటర్ అంతా ఉలిక్కి పడింది. అయితే ఆ బులెట్స్ ప్రాణాలు తీసే స్థాయి చోట తగలేకపోవడంతో క్షతగాత్రుడు ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించుకోగా ఆ కాల్చిన వ్యక్తి మాత్రం పరారీలో ఉన్నట్టు కర్ణాటక పోలీస్ తెలియజేసారు.

సంబంధిత సమాచారం :