తీరని విషాదం..కోలీవుడ్ నటుడు వివేక్ ఇక లేరు.!

తీరని విషాదం..కోలీవుడ్ నటుడు వివేక్ ఇక లేరు.!

Published on Apr 17, 2021 7:38 AM IST


ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర మరో తీరని విషాదం చోటు చేసుకుంది. జస్ట్ నిన్ననే కోలీవుడ్ కి చెందిన స్టార్ నటుడు మరియు ప్రముఖ కమెడియన్ వివేక్ గుండె నొప్పితో ఆసుపత్రిలో చేరారని వార్త విన్నాము. కానీ మళ్ళీ ఆ ఒక్క తర్వాతి రోజుకే అతను లేరు అనే వార్త వినాల్సి వస్తుంది అని ఎవరూ ఊహించి ఉండరు. ఎన్నో నవ్వులు పూయించిన వివేక్ ఆకస్మిక మరణం ఇప్పుడు ప్రతీ ఒక్కరినీ ఎంతో షాక్ కు గురి చేసింది.

హార్ట్ అటాక్ తో చెన్నై ఆసుపత్రిలో నిన్న ఉదయం చేరిన వివేక్ ఈ శనివారం తెల్లవారు జాము 4 గంటల 35 నిమిషాలకు తన 59 ఏళ్ల వయసులో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్టుగా నిర్ధారణ అయ్యింది. హృదయానికి సంబంధించి కీలక చికిత్స నిర్వహిస్తున్న సమయంలో ఇలా జరిగింది అని వైద్యులు తెలిపారు.

దీనితో వివేక్ మరణం పట్ల తమిళ సినిమా దిగ్బ్రాంతికి లోనయ్యి నివాళులు అర్పిస్తుంది. అయితే వివేక్ కేవలం తన పాత్రలతో ఆన్ స్క్రీన్ పై నవ్వించడమే కాకుండా నిజ జీవితంలో సామాజికంగా బలమైన ఆశలు ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి అకాల మరణంను ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. మరి వివేక్ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనం కూడా కోరుకుందాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు