‘పెద్ది’ స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్!

‘పెద్ది’ స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్!

Published on Apr 28, 2026 7:03 AM IST

peddi

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న అవైటెడ్ సినిమానే పెద్ది. మంచి అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు తుది దశకు చేరుకుంది. అయితే ప్రస్తుతం మేకర్స్ ఓ స్పెషల్ సాంగ్ ని చిత్రీకరణ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఈ సాంగ్ పై కొన్ని విజువల్స్ లీక్ కావడం షాకింగ్ గా మారింది.

నేరుగా సెట్స్ నుంచే చరణ్,శృతి హాసన్ డాన్స్ రిహార్సల్స్ చేస్తున్న విజువల్స్ నెట్టింట వైరల్ గా మారాయి. అయితే శృతి హాసన్ కాస్ట్యూమ్ లో ఉన్నట్టు ఇందులో తెలుస్తోంది. ఇలా పెద్ది నుంచి ఊహించని లీక్ వచ్చిందని చెప్పవచ్చు. మరి సెట్స్ లో భద్రత విలువలు ఏ రకంగా ఉన్నాయో అనేది కూడా దీనితో అర్ధం అవుతుంది. ఇక ఈ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు అలాగే వృద్ది సినిమాస్ నిర్మాణం వహిస్తున్న ఈ సినిమా ఈ జూన్ 25న గ్రాండ్ గా విడుదల కాబోతోంది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు