“బిగ్ బాస్ 5” గ్రాండ్ ఓపెనింగ్ ఎపిసోడ్ కి ఊహించని టీఆర్పీ.!

Published on Sep 16, 2021 12:55 pm IST


వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ మన తెలుగులో కూడా ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. ముఖ్యంగా ఇండియాలో అన్ని భాషల్లో కంటే తెలుగులో భారీ రెస్పాన్స్ ఈ షోకి వస్తుంది. మరి గత మూడు సీజన్ల కి కింగ్ నాగార్జున అదిరే లెవెల్ హోస్టింగ్ తో హోరెత్తిస్తుండగా ఈసారి సీజన్ 5 కి కూడా తానే గ్రాండ్ వెల్కమ్ అందించారు. మరి ఈ మోస్ట్ అవైటెడ్ షో ఐదవ సీజన్ గ్రాండ్ ఓపెనింగ్ ఎపిసోడ్ కి భారీ రెస్పాన్స్ నే అంతా ఆశించారు.

కర్టెన్ రైజింగ్ ఎపిసోడ్ గా పిలిచే ఈ ఎపిసోడ్ కి ఈసారి ఊహించని రేటింగ్ నే వచ్చింది అని చెప్పాలి. గత సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ కి 18.5 ఆల్ టైం రికార్డు టీఆర్పీ రాగా ఈసారి బాగా డ్రాప్ అయ్యింది అని చెప్పాలి. ఈసారి మాత్రం కేవలం 15.7 టీఆర్పీ రేటింగ్ మాత్రమే వచ్చింది అట. అంతే కాకుండా ఈ ఐదు సీజన్లలో ఇది ఐదవ అధిక్యం.. సో ఈసారి పెద్దగ వీక్షకులు ఆసక్తి చూపలేదనే చెప్పాలి. మరి ఇక ముందు రేటింగ్స్ ఫైనల్స్ రేటింగ్ ఎలా వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :