“సాహో” కు ఇది షాకింగ్ టీఆర్పీనే.!

Published on Oct 29, 2020 12:00 pm IST

బాహుబలి లాంటి అంతర్జాతీయ స్థాయి హిట్ కొట్టిన తర్వాత అలాంటి భారీ చిత్రంలో నటించిన తర్వాత ప్రభాస్ ఎలాంటి సినిమాను టేకప్ చేస్తాడా అని అనుకుంటున్నా సమయంలో సుజీత్ లాంటూ యువ దర్శకుడితో భారీ యాక్షన్ డ్రామాను టేకప్ చేసాడు. అదే “సాహో”. శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని మన ఇండియన్ స్క్రీన్ పైనే కనీ వినీ ఎరుగని రేంజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా అత్యుత్తమ ప్రమాణాలతో తెరకెక్కించారు.

కానీ ఊహించని విధంగా ఇది నిరాశనే ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే బాలీవుడ్ లో మాత్రం అదిరిపోయే హిట్ గా నిలిచి అదే ప్లాప్ టాక్ తో ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. అయితే ఈ చిత్రం తెలుగు వెర్షన్ టెలివిజన్ ప్రీమియర్ కోసం చాలా మందే ఎదురు చూసారు. కానీ ఫైనల్ గా గత కొన్ని రోజుల కితం జీ తెలుగు ఛానెల్లో టెలికాస్ట్ చేసిన ఏ ఈచిత్రానికి ఊహించని టీఆర్పీ వచ్చింది.

ఈ చిత్రానికి కేవలం 5.8 టీఆర్పీ రేటింగ్ మాత్రమే రావడం ఆశ్చర్యకరం. ఇదే అనుకుంటే అదే రోజున టాలెంటెడ్ హీరో కార్తికేయ హీరోగా నటించిన “గుణ 369” చిత్రం టాప్ ఛానెల్స్ లో ఒకటైన ఈటీవీ లో ప్రసారం చెయ్యగా దానికి 5.9 టీఆర్పీ రేటింగ్ రావడం విశేషం. మొత్తానికి మాత్రం సాహో టీఆర్పీచూసి ప్రభాస్ ఫ్యాన్స్ సహా మిగతా అంతా ఇంత తక్కువ వచ్చిందా అని అనుకుంటున్నారు.

సంబంధిత సమాచారం :

More