ఘాటింగ్ పూర్తి చేసుకున్న చిత్రలహరి !

Published on Mar 15, 2019 6:00 pm IST

‘నేను శైలజ’ ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ నటిస్తున్న తాజా చిత్రం ‘చిత్రలహరి’ షూటింగ్ ఈ రోజు తో కంప్లీట్ అయ్యింది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తేజు సరసన కళ్యాణి ప్రియదర్శన్ ,నివేత పేతురాజ్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇక ఇటీవల విడుదలైన ఈ చిత్రం యొక్క టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా ఫై అంచనాలు పెరిగిపోయాయి.

రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రపీ అందిస్తున్నారు. ఈచిత్రం ఏప్రిల్ 12న విడుదలకానుంది. ఇక ఈచిత్రం ఫై తేజు భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఈచిత్రం విజయం సాదించడం ఆయన కెరీర్ కు చాలా కీలకం కానుంది. మరి తేజు ఈ చిత్రం తో సాలిడ్ హిట్ కొట్టి బౌన్స్ బ్యాక్ అవుతాడో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :

X
More