యుఎస్ లో మొదలైన ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’

యుఎస్ లో మొదలైన ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’

Published on Apr 29, 2015 3:45 PM IST

subhramanyam-for-sale

మెగా ఫ్యామిలీ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ చేస్తున్న మూడవ సినిమా ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’. మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రెజీన కసాండ్ర రెండవ సారి సాయి ధరమ్ తేజ్ సరసన జోడీ కడుతోంది. ఈ సినిమా షూటింగ్ కొద్ది రోజుల క్రితం వరకూ హైదరాబాద్ లో జరిగింది. ఒక వారం రోజుల క్రితమే ఈ చిత్ర టీంలోని ముఖ్యులంతా యుఎస్ వెళ్ళారు. గతవారం రోజులుగా అక్కడ పలు లోకేషన్స్ ని విజిట్ చేసిన ఈ చిత్ర టీం నేటి నుంచి షూటింగ్ మొదలు పెట్టింది. ఈ సినిమాలో మేజర్ పార్ట్ యుఎస్ లో షూట్ చేస్తారు.

ఈ యుఎస్ షెడ్యూల్ తో సుబ్రమణ్యం ఫర్ సెల్ షూటింగ్ ఒక 80% దాకా పూర్తవుతుంది. ఆ తర్వాత ఇండియాలోని పలు లోకేషన్స్ లో షూట్ చేస్తారు. సినిమాలో ఆద శర్మ ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. కమర్షియల్ అంశాలను జోడించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో సుమన్, ప్రగతి, తేజస్వి, సురేఖ వాణి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పూర్తి కమర్షియల్ హంగులతో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు.

తాజా వార్తలు