సాంగ్ షూట్ లో ‘అహం బ్రహ్మాస్మి’ !

Published on Feb 28, 2021 6:10 pm IST

మంచు మనోజ్ ‘అహం బ్రహ్మాస్మి’తో మళ్ళీ సినిమాల్లో యాక్టివ్ అవ్వడానికి సన్నాహాలు చేసుకుంటూ ఆ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో తీయాలనుకున్నాడు. ఇప్పటికే, కీలక సన్నివేశాల షూటింగ్ కూడా పూర్తయిన సంగతి తెలిసిందే. కాగా, ప్రస్తుతం ఈ సినిమా సాంగ్ కి సంబంధించిన షూట్ ను రేపటి నుండి మొదలుపెట్టనున్నారని తెలుస్తోంది. ఈ సాంగ్ పూర్తిగా కొత్తగా ఉంటుందట. సంస్కృతంలో సాంగ్ ఉంటుందట.

కాగా ఎప్పుడూ కొత్తదనం కోసం వైవిధ్యమైన కథలతో సినిమాలు చేస్తాడు మనోజ్. ఈ సారి కూడా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో.. ‘అహం బ్రహ్మాస్మి’ అనే గొప్ప స్లోగన్ ఆధారంగా నడిచే కథతో పవర్ ఫుల్ రీఎంట్రీ ఇస్తున్నాడు. మరి ఈ సినిమాతోనైనా మనోజ్ కి భారీ హిట్ వస్తోందేమో చూడాలి. ఇక ఇండస్ట్రీలో కొత్త టాలెంట్‌ ను ఎంకరేజ్‌ చేయాలని ‘ఎమ్ఎమ్‌ ఆర్ట్స్‌’ పేరుతో మంచు మనోజ్ సొంత నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే.

దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా ఎమ్ ఎమ్ ఆర్ట్స్ పతాకం పై మంచు ఫ్యామిలీ స్వయంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :