కలెక్షన్లు పెరగాలంటే రేట్లు తగ్గాల్సిందేనా ?

కలెక్షన్లు పెరగాలంటే రేట్లు తగ్గాల్సిందేనా ?

Published on Jun 8, 2026 11:59 AM IST

Peddi

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా.. ప్రేక్షకులతో పాటు ఇటు అభిమానుల నుంచి కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే, టికెట్ ధరలు ఎక్కువగా ఉండటం వల్ల ప్రస్తుతం థియేటర్స్ కి ప్రేక్షకుల రాక కొంత తగ్గుముఖం పట్టింది. మరోవైపు కుటుంబ ప్రేక్షకులు ధరలు తగ్గే వరకు వేచి చూస్తున్నారు. ఎలాగూ రెండో వారం మొదలైనందున, ఎక్కువ మంది ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడానికి, టికెట్ ధరలను తగ్గించడానికి ఇదే సరైన సమయం. పైగా ఈ వారం పెద్ద సినిమాలేవీ విడుదలకు సిద్ధంగా లేవు.

మరి టికెట్ రేట్లు తగ్గింపును చిత్ర బృందం పరిగణనలోకి తీసుకుంటే వసూళ్లు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా సాధారణ ప్రేక్షకులను ఆకర్షించడానికి, అలాగే రిపీట్ ఆడియెన్స్‌ను పెంచడానికి టికెట్ ధర తగ్గింపు అనేది బాగా పని చేస్తోంది. ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ సంస్థ రూ. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించింది. వెంకట సతీష్ కిలారు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ భారీ యాక్షన్ ఎమోషనల్ డ్రామాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించింది.

బుచ్చిబాబు సానా దర్శకత్వంలో, ఏఆర్ రెహమాన్ సంగీతంలో వచ్చిన ఈ సినిమాలో శివ రాజ్ కుమార్, జగపతి బాబు, జాన్వీ కపూర్, దివ్యేందు శర్మ తదితరలు కీలక పాత్రలు పోషించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు