సాహో భామ ఆమె బయోపిక్ అందుకే చేయలేదట

Published on Aug 14, 2019 7:03 am IST

భారత స్టార్ షట్లర్స్ లో సైనా నెహ్వాల్ ఒకరు. ఆమె అనేక అంతర్జాతీయ వేదికలపై అపూర్వ విజయాలు సాధింది స్టార్ షట్లర్ గా గుర్తింపు పొందారు. ఐతే ఆమె బయో పిక్ హిందీలో తెరకెక్కుతున్న సంగతి తెల్సిందే.’సైనా’ అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సైనాగా పరిణీతి చోప్రా నటిస్తున్నారు. అమోల్ గుప్తే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు.

ఐతే ఈ మూవీలో మొదట హీరోయిన్ గా శ్రద్దా కపూర్ అనుకోవడం జరిగింది. ఈ చిత్రం కొరకు కొద్దిరోజులు నిపుణుల పర్యవేక్షణలో ఆమె శిక్షణ కూడా తీసుకున్నారు. ఏమైందో తెలియదు సడన్ గా ఆ ప్రాజెక్ట్ నుండి ఆమె తప్పుకున్నారు.

ఐతే తాజాగా సాహో మూవీ ప్రొమోషన్స్ లో పాల్గొంటున్న శ్రద్దాను ఈ విషయం అడుగగా కేవలం డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వలనే ఈ మూవీ వదిలేశానంటూ చెప్పుకొచ్చారు. ఆ తరువాత ఈ మూవీ కొరకు పరిణితీ చోప్రా తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :