“ఆర్ఆర్ఆర్” లో ఎన్టీఆర్ కి జోడిగా శ్రద్ధాకపూర్ – ఇది నిజమేనా…?

Published on Apr 16, 2019 3:37 am IST

ప్రస్తుతానికి తెలుగులో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం “ఆర్ఆర్ఆర్”. ప్రముఖ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఇద్దరు కూడా నటిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో ఎన్టీఆర్ కి జోడిగా బ్రిటన్ నటి డైసీ ఎడ్గర్ జోన్స్ నటించనుందని రాజమౌళి ఇదివరకే ప్రకటించగా, ఇప్పుడు కొన్ని కారణాల వలన ఆ నటి ఈ ప్రాజెక్టు నుండి తప్పుకుంది. అయితే ఎన్టీఆర్ కి జోడిగా ఎవరు నటించనున్నారో అని ప్రేక్షకుల్లో తీవ్రమైన ఆసక్తి నెలకొంది.

కాగా ఎన్టీఆర్ కి జోడిగా నటించేందుకు పలువురు పేర్లు వినిపించాయి. దాంట్లో పరిణీతి చోప్రా, ఆ తరువాత నిత్యా మీనన్ పేర్లు బాగా వినిపించాయి. కానీ తాజాగా మరో బాలీవుడ్ భామ పేరు తెరపైకి వచ్చింది. తానెవరో కాదు, సాహో భామ శ్రద్ధా కపూర్. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కి జోడిగా శ్రద్ధ సరిగ్గా సరిపోతుందని, శ్రద్ధ కపూర్ దాదాపుగా ఖరారు అయినట్లు జోరుగా ప్రచారం సాగుతుంది. కానీ ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురుచూడక తప్పదు.

సంబంధిత సమాచారం :