2011లో విడుదల అయిన ‘మొగుడు’ సినిమా తరువాత తెలుగులో కనిపించని శ్రద్ధా దాస్, మరో సారి తెలుగు ప్రజలను అలరించనుంది. ఈ మధ్యకాలంలో మలయాళం, బెంగాలీతో పాటు ఇతర భాషలలో బీజిగా ఉన్న ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు చేస్తుంది. ‘రేయి’ సినిమాలో నటిస్తున్న తను ‘సూపర్ స్టార్ కిడ్నాప్’ సినిమాలో అతిధి పాత్ర చేస్తుంది. ఆదర్శ బాలకృష్ణ, భూపాల్, నందు, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ కామెడీ సినిమాలో శ్రద్ధా దాస్ ఒక రౌడీ పాత్రలో కనిపించనుంది. ‘తన పాత్ర ‘ఫాస్ గయా రే ఒబామా’ అనే హింది సినిమాలో నేహ దుపియా చేసిన పాత్రలా ఉంటుందని’, శ్రద్ధా అన్నారు.
ప్రస్తుతం హైదరబాద్ లో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ లో శ్రద్ధా దాస్ పాల్గొంటున్నారు. సుశాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని చందు పెన్మట్స నిర్మిస్తున్నారు.


