బిగ్ బాస్ రూమర్స్, రాసేముందు నన్ను అడగొచ్చుగా: శ్రద్దా దాస్

బిగ్ బాస్ రూమర్స్, రాసేముందు నన్ను అడగొచ్చుగా: శ్రద్దా దాస్

Published on Sep 6, 2019 3:00 PM IST

బిగ్ బాస్ తెలుగు వైల్డ్ కార్డు ఎంట్రీ పై పెద్ద చర్చే నడిచింది. అందరి ఊహాగానాలకు తెరదించుతూ నటి మరియు యాంకర్ అయిన శిల్పా చక్రవర్తి ఈవారం బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఐతే దీనికి ముందు అన్ని ప్రచార మాధ్యమాలలో వైల్డ్ కార్డు ఎంట్రీ పై అనేక పుకార్లు నడిచాయి. ప్రముఖంగా ఇద్దరు టాలీవుడ్ హీరోయిన్ల పేర్లను ప్రస్తావించి రాయడం జరిగింది. వారిలో శ్రద్దా దాస్ కూడా ఉన్నారు.

ఐతే ఈ విషయంపై మొదటిసారి ఆమె స్పందించారు. ఏవిషయంలోనైనా నా కంఫర్ట్, ఇష్టం, పాజిబిలిటీ వంటి అన్ని విషయాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటాను. నేను ప్రస్తుతం దేశంలోని ఐదు భాషల చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నాను. నాకు తెలియకుండా, అసలు సంప్రదించకుండా బిగ్ బాస్ షో లో పాల్గొనబోతున్నారంటూ ఎలా రాస్తారు అని ప్రశ్నించారు. కనీసం రాసే ముందు అడగొచ్చు కదా అని అసహనం వ్యక్తం చేశారు. అసలు బిగ్ బాస్ షో కి సంబంధించి ఎవరు నన్ను కలిసిందే లేదని ఆ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు