కష్టమైనా సరే.. ఓకే చెప్పిన శ్రద్ద శ్రీనాథ్ !

Published on May 14, 2019 3:57 pm IST

నానితో కలిసి ‘జెర్సీ’ సినిమాతో మంచి హిట్ అందుకుని హీరోయిన్ శ్రద్ద శ్రీనాథ్. ఈ సినిమా విజయంతో ఆమెకు అవకాశాలు బాగా పెరిగాయి. తమిళంలో కూడా క్రేజ్ ఉండటంతో విశాల్ చేయనున్న కొత్త సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది శ్రద్ద. ఈ చిత్రంలో ఆమె పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుందట. ఆమెపై యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని, ఆ పాత్ర కొన్ని నెగెటివ్ షేడ్స్ కలిగి ఉంటుందని తెలుస్తోంది.

పాత్ర కష్టమైనదే అయినా ఛాలెంజింగా ఉండటంతో సినిమాకు వెంటనే ఒప్పుకుందట శ్రద్ద. ఇందులో హీరో విశాల్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని దర్శకుడు ఎజిల్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన ఆనంద్ డైరెక్ట్ చేయనున్నారు. ఇప్పటికే చిత్ర షూటింగ్ మొదలైన ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More