చిన్న చిత్రాన్ని సపోర్ట్ చేస్తున్న శ్రీ విష్ణు !

చిన్న చిత్రాన్ని సపోర్ట్ చేస్తున్న శ్రీ విష్ణు !

Published on Jul 31, 2018 9:00 PM IST

sreevishnu1

మనోజ్, ప్రియాంక శర్మ హీరో హీరోయిన్లు గా హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘తరువాత ఎవరు’. నూతన దర్శకుడు కృష్ణ ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈచిత్రం యొక్క ట్రై లర్ ను ప్రముఖ నటుడు శ్రీ విష్ణు విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘తరువాత ఎవరు’ ట్రైలర్ చాలా బాగుంది, సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నానని చిత్ర యూనిట్ కు శుభాకంక్షాలు తెలియజేశారు.

ప్రముఖ నటుడు కమల్ కామరాజ్ అతిధి పాత్రలో నటించిన ఈచిత్రం ఆగష్టు 3న ప్రేక్షకులముందుకు రానుంది. ఇక అదే రోజు విడుదలవుతున్న ‘గూఢచారి , చి ల సౌ’ చిత్రాల తో బాక్సాఫిస్ వద్ద పోటీపడనుంది ఈ చిత్రం.

తాజా వార్తలు