లేడీ ఓరియెంటెడ్ సినిమాలో కలిసి నటించనున్న శ్రియ, నిహారిక !

18th, June 2018 - 01:37:40 PM

స్టార్ హీరోయిన్ శ్రియ శరన్ తెలుగులో కొత్త సినిమాకు సైన్ చేశారు. ఈ లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ ఈరోజే లాంచ్ అయింది. హీరో వరుణ్ తేజ్ ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. దర్శకుడు క్రిష్ మొదటి షాట్ ను డైరెక్ట్ చేశారు. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సోదరి, హీరోయిన్ నిహారిక కూడ నటించనుంది. ‘కంచె, వేదం, శాతకర్ణి’ సినిమాలకు పనిచేసిన సినిమాటోగ్రఫర్ జ్ఞానశేఖర్ నిర్మాతగా మారి నిర్మిస్తున్న మొదటి చిత్రం ఇది.

నూతన దర్శకురాలు సుజనా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనుండగా ప్రముఖ సంగీత దర్శకుడు మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందివ్వనుండటం విశేషం. క్రియ ఫిల్మ్ కార్పొరేషన్, కాళి ప్రొడక్షన్స్ బ్యానర్లపై రమేష్ కరుటూరితో కలిసి జ్ఞానశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెగ్యులర్ షూట్ ఎప్పుడు మొదలవుతుంది, సినిమా ఎలా ఉండబోతుంది వంటి ఇతర వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.